ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సరికొత్త పంథాలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అనేక స్థానికి, జాతీయ సమస్యలపై గళం విప్పుతూ.. కుండ బద్దలుకొట్టినట్టు తన అభిప్రాయాల్ని వెల్లడిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్న ఆయన త్వరలో ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ‘ఇండియా ఎహెడ్’ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట.
ఈ షోకు సంబందించిన పనులు మొదలవుతాయని, ఈ షోలో పవన్ అనేక సామాజిక అంశాలు, సమస్యలపై మాట్లాడతారని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే పవన్ లేదా జనసేన శ్రేణుల నుండి అధికారిక ప్రకటన వెలువడే వరుకు వెచిచూడాల్సిందే.