ఆ హీరో విలన్ గా మారుతున్నాడు..?
బాల నటుడిగా చాలా చిత్రాల్లో నటించిన తనీష్ ఆ తరువాత హీరోగా ఓ నాలుగైదు సినిమాలు చేశాడు. అయితే తన మార్క్ పడేలా ఒక్క సినిమా కూడా లేదు. గత కొంతకాలం నుండి తనీష్ కు తెలుగులో
అవకాశాలు లేకుండా పోయాయి. ఈ నేపధ్యంలో తనీష్ కు కృష్ణవంశీ నుండి ఫోన్ వచ్చిందట.
అది కూడా విలన్ పాత్ర కోసం. తనీష్ ఏ యాంగిల్ చూసి కృష్ణవంశీ విలన్ రోల్ ఆఫర్ చేశాడో
తెలియదు కాని తనీష్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో సందీప్
కిషన్ హీరోగా ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనుండగా.. హీరో సాయి ధరం తేజ్ కృష్ణ వంశీ కోసం
ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవనున్నాడు. యువ హీరోలను ప్రోత్సహించాలి అన్నట్లుగా
కృష్ణవంశీ హీరో నుండి విలన్ వరకు ఈ తరం యంగ్ హీరోస్ ను సెలెక్ట్ చేసుకోవడం మంచి విషయం.
త్వరలోనే తనీష్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాతో తనకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడు.