టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోల సంఖ్య బాగానే ఉంది. చాలా మంది హీరోలు మూడు పదుల వయసు దాటుతున్నా పెళ్లి అనే మాట మాత్రం ఎత్తడం లేదు. అప్పుడే పెళ్లి అంటూ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చిన వారికి మాత్రం పెళ్లి ప్రశ్నలు తప్పడం లేదు. రీసెంట్ గా వరుణ్ తేజ్ ను కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని చెప్పేసాడు ఈ మెగాహీరో. అంతటితో ఆగాడా అంటే లేదు. పెళ్లి విషయంలో ప్రభాస్ అన్నను స్పూర్తిగా తీసుకుంటున్నాను అని సమాధానం ఇచ్చాడు.
నాలుగు పదుల వయసుకి దగ్గర పడుతున్నా ప్రభాస్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆయన పెళ్లి కోసం కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్.. ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ ను స్పూర్తిగా తీసుకోవడం చూస్తుంటే తను కూడా నలభై ఏళ్ళు వస్తేకానీ పెళ్లి చేసుకోడేమో!