HomeTelugu Newsఆర్‌జే బాలాజీ హీరోగా "ఎల్‌కేజీ"

ఆర్‌జే బాలాజీ హీరోగా “ఎల్‌కేజీ”

రాజకీయాల్లో ఎవరైనా నాయకుడు కావొచ్చు. సినిమాల్లో ఎవరైనా కథానాయకుడు కావొచ్చు. సినిమాలకు, రాజకీయాలకు మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. ఇదే విధంగా హీరోగా మారిన హస్యనటుల జాబితాలో తాజాగా ఆర్‌జే. బాలాజీ చేరనున్నాడు. ఆకర్షించే నటన, చక్కని మాటకారి వంటి ప్లస్‌ పాయింట్స్‌తో కొద్ది కాలంలోనే ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ఆర్‌జే. బాలాజీ. ఇతను ఎల్‌కేజీ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. రాజకీయ సెటైరికల్‌ ప్రధానంగా రానున్న ఈ చిత్రం వేల్స్‌ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్‌ కె.గణేశ్‌ నిర్మిస్తున్నారు. ఆర్‌జే. బాలాజీ సరసన ప్రియా ఆనంద్‌ నటిస్తోంది..

2 7

ప్రముఖ రాజకీయ నాయకుడు, సాహితీవేత్త అయిన నాంజల్‌ ముఖ్య పాత్ర ద్వారా నటుడిగా పరిచయం అవుతండటం విశేషం. ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆర్‌జే. బాలాజీ తెలుపుతూ ఈ తరం యువతకు రాజకీయాల గురించి తెలియనిది లేదనే చెప్పవచ్చన్నారు. ఈ సోషల్‌ మీడియా కాలంలో యువతకు రాజకీయం గురించి, రాజకీయ నాయకుల మనస్తత్వాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ ఎల్‌కేజీ అటువంటి తరహ చిత్రమేనని అన్నారు. ఈ చిత్రంలో తనకు తండ్రిగా నాంజల్‌ సంపత్‌ నటిస్తున్నారని చెప్పారు. నేటి యువతరంలో నాంజల్‌ సంపత్‌కు మంచి పేరు ఉందన్నారు. అదే విధంగా ఈ చిత్రంలో తన చిరకాల స్నేహితురాలైన ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించిందని తెలిపారు. ఈ చిత్రానికి జేమ్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో విడుదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!