జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ నందమూరి హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. హరికృష్ణ అకాల మరణం చాలా భాధ కలిగించిందని అన్నారు.
హరికృష్ణ తో తన పరిచయం తక్కువే అయినా రాష్ట్ర విభజన సమయంలో ఆయన పదవికి రాజీనామా చేయడం నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే సంఘటన అని అన్నారు. ఆయన మరణం చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ తెలిపారు. కాగా హరికృష్ణ మృతికి సంతాపంగా ఈ రోజు తమ పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.