HomeTelugu Big Storiesఆయనకొక రూల్‌, నాకొక రూలా?

ఆయనకొక రూల్‌, నాకొక రూలా?

టాలీవుడ్‌ స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ ఇటీవల.. తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం గోవాలో ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయంలోనూ తనకు పవన్‌ అభిమానుల నుంచి బెదిరింపులు, విమర్శలు వస్తున్నాయని రేణూ వెల్లడించారు. ఇటీవలే ‘నా జీవితం ప్రశాంతంగా ఉండడానికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడాలని అనుకుంటున్నాను అంటూ ట్విట్టర్‌ ఖాతాను నుంచి కూడా తప్పుకుంది.

4 7

రేణూ తాజాగా స్పందిస్తూ.. ‘నా జీవితం ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను.. కానీ జీవితం అందుకు భిన్నంగా జరుగుతోంది. గత ఐదేళ్లుగా నన్ను అనరాని మాటలు అంటూ నేను చేయని తప్పులకు నిందిస్తున్నవారి గురించి పట్టించుకోవద్దని కొందరు నాకు సలహా ఇచ్చారు.నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నా కోసం నేను మాట్లాడుతుంటే అన్నీ మౌనంగా భరించాలని చెప్పారు. పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నానని మరికొందరు అన్నారు.

ఇప్పుడేమో పవన్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు ఓ వ్యక్తి కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నాడు. కొందరేమో పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్ చేయాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే మరికొందరు బెదిరిస్తున్నారు. ఆయనకొక రూల్‌, నాకొక రూలా? గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? నోరుమూసుకుని అన్నీ భరించమని నాకు సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ సమాజంలో ఉంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒక రోజు నాకంటూ మనశ్శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను. మరో విషయం గుర్తుపెట్టుకోండి. నేనెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు’ అని పేర్కొన్నారు రేణు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu