అక్కినేని నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన మూవీ “ఆఫీసర్”.. ఈ చిత్రం జూన్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు… ఇందులో నాగార్జున ప్యామిలీ, చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అప్పట్లో నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన శివ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అంతం, గోవిందా గోవింద చిత్రాలు అంతగా సక్సెస్ సాధించలేదు. ఎప్పటి నుంచో చెబుతున్నాడు మళ్లీ శివ లాంటి రికార్డులు తిరగరాసే సినిమా నాగ్‌తో చేస్తానని వర్మ చాలాసార్లు అన్నాడు. చాలాకాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు ఆఫీసర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం గురించి నాగార్జునతో పాటు ఫ్యామిలీ కూడా బాగానే చెబుతున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి రిలీజ్ వేడుకలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “తెలుగు ఇండస్ట్రీలో ‘శివ’కు ముందు,’శివ’ తరువాత అని మాట్లాడుకుంటారు. శివ చిత్రం నాకు బ్రేక్ మాత్రమే కాదు.. అమలనూ ఇచ్చింది. ఈ సినిమాకు యువబృందం చాలా బాగా పని చేసింది. నాలో కూడా మార్పు వచ్చిందనిపించింది. ఓ పోలీస్ ఆఫీసర్‌ని ఎలా చూడాలనుకుంటామో అలాంటి ఆఫీసర్ కథ చెప్పాడు వర్మ. షూటింగ్‌కి ముందు వర్మ నాకో ఉత్తరం రాశాడు. అందులో బూతులు కూడా ఉండటంతో..నేను ఆ ఉత్తరం చదవలేదు. చెప్పింది చేయకపోతే నన్ను తన్నమన్నాడు. తనని తన్నవలసిన అవసరం లేదు. ఈ సినిమాని చిత్తశుద్ధితో చేశాడు వర్మ. ‘శివ’ విడుదలైనప్పుడు సౌండ్ గురించి మాట్లాడారు. ఈ తరువాత అలాంటి మాటలు వినిపించలేదు. ఇప్పుడు మళ్లీ శివ తరువాత ‘ఆఫీసర్’ వస్తోంది. ఈ సౌండ్ గుండెల్ని తాకుతుంది. యాక్షన్ సన్నివేశాలు హింసాత్మకంగా ఉండవు, కిరాతకంగా ఉండవు గానీ…సహజంగా అనిపిస్తాయి. చివరి 20 నిమిషాల యాక్షన్ ఘట్టాలు బాగుంటాయి. బ్రూస్లీ, రాంబో సినిమాల స్థాయికి తీసుకెళ్లాడు. ఇదేదో నా సినిమా అని చెప్పుకోవడం లేదు, ఇది రామ్ సినిమా అది అతని గొప్పతనం అని ఆర్జీవీని తన పొగడ్తలతో ముంచెత్తేశాడు నాగార్జున. ఈ చిత్రం జూన్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.