‘ప్రేమ కావాలి’ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు యువ కథానాయకుడు ఆది. ఇప్పుడు తాజాగా దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న ‘బుర్రకథ’ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటి వరకు రచయితగా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు..ఈ చిత్రంతో డైరెక్టర్‌గా మారబోతున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. ”ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్‌కు వచ్చి, డైరెక్టర్‌గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు టాప్ టెక్నీషియన్స్‌ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు నా ప్రొడ్యూసర్‌కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కథ చెప్పిన వెంటనే సినిమాని ఓకే చేసి నాపై నమ్మకం ఉంచిన హీరో ఆది గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా స్క్రీన్‌ప్లే రైటర్స్‌ని పరిచయం చేస్తున్నాను. వారికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..” అన్నారు. ”ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఒక పాట రాస్తున్నాను. ఈ సినిమా విజయవంతమై చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” రచయిత శివ శక్తి దత్త అన్నారు.