ఇటీవల ఓ మేగజైన్ కోసం నటి ఆదాశర్మ ఓ ఫొటో షూట్ చేసింది. ఇందులో తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చపరిచింది ఆదాశర్మ. అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. వాటికి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. అంత అందమైన శరీరాకృతిని ఎలా సాధించారు? అంటూ ఆమెను పలువురు అడిగారు. ఇందుకు స్పందించిన ఆదాశర్మ శుక్రవారం ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.
తాడును నడుముకి చుట్టుకుని ఓ చెట్టుకు వేలాడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ఆమె రాత్రంతా ఇలా వేలాడుతూ నిద్రపోతే 8 ప్యాక్స్ ఉచితంగా వస్తాయని చెప్పారు. జిమ్నాస్ట్‌లు స్తంభం లేదా తాడుని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ చేసే కసరత్తులను మల్లకంభ అంటారు. ఈ రోజు అంతర్జాతీయ మల్లకంభ దినోత్సవం సందర్భంగా ఆమె తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాడును పట్టుకుని వేలాడుతూ కసరత్తులు చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే, తాడును బ్యాలెన్స్ చేయాలంటే అందుకు తగ్గ శక్తి, స్థిరత్వం మన శరీరానికి ఉండాలని పేర్కొన్నారు.