HomeTelugu Newsఆగస్టు 15న `అరవింద సమేత` టీజర్‌..!

ఆగస్టు 15న `అరవింద సమేత` టీజర్‌..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా `అరవింద సమేత`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 15కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది.

2 13

అయితే ఇప్పుడు అదే నిజం కానుంది. ఆగస్టు 15 ఉదయం9 గంటలకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నామని ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో.. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu