ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సికి క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలు ఎదురు కాలేదట. కెరీర్ ప్రారంభంలో పెద్ద హీరోలతో, పెద్ద బ్యానర్లో సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో తనకు ఆ అనుభవం ఎదురుకాలేదంటోంది తాప్సి. తన దగ్గర ఎవరు అలాంటి విషయాల గురించి మాట్లాడేవారు కాదని, తనకు అలాంటి అనుభవం ఎదురై ఉంటె తానూ కూడా చక్కగా ఆ విషయంపై మాట్లాడేదాన్ని అంటోంది సొట్టబుగ్గల తాప్సి.
వ్యక్తిగత విషయాల గురించి చెప్పేందుకు అంగీకరించని తాప్సి, డేటింగ్ విషయం గురించి నో కామెంట్ అంటూ.. మాట దాటేస్తుంది తాప్సి. కాగా బాలీవుడ్ లో వరస హిట్స్ తో దూసుకుపోతున్నది తాప్సి. పింక్, ముల్క్ సినిమాలు ఆమె కెరీర్ ను మార్చిన చిత్రాలుగా నిలిచాయి.