HomeTelugu News'అరవింద సమేత వీర రాఘవ' టీజర్‌

‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబఇనేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌ లో మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. ‘కంటపడ్డానా కనికరిస్తానేమో..వెంటపడ్డావో నరికేస్తావోబా..’ అంటూ తారక్‌ చెప్తున్న డైలాగ్‌ అదిరిపోయింది.

1 24

ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ సంభాషణలు చెప్పబోతున్నారు. తెరపై మరోసారి సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu