అరవింద సమేత సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారమొచ్చినా లేదా ఫొటోలు వచ్చినా ఇట్టే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పెనివిటి అనే పల్లవితో సాగే రెండో పాట శ్రోతల గుండెల్ని పిండేస్తోంది. ఈ పాటను గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించారు.
ఇదిలా ఉంటె, ఈషా రెబ్బ తన ట్విట్టర్ అకౌంట్లో తారక్, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేసింది. తను కూడా ఈ సినిమాలో ఉన్నానని చెప్పేందుకు ఈషా ఈ సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. అరవింద సమేత అనగానే పూజ హెగ్డే గురించి చెప్తున్నారుగాని, ఈషా గురించి చెప్పడంలేదు. అసలు ఈషా రెబ్బ ఈ సినిమా చేస్తుందో లేదో కూడా బయటకు తెలియకపోవడంతో.. తాను కూడా సినిమాలో ఉన్నానని గుర్తించండి అంటూ మీడియాకు తెలిపేందుకే ఈషా ఈ ఫొటో పోస్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.