HomeTelugu Big Storiesఅమ్మ అధ్యక్షుడికి చేదు అనుభవం

అమ్మ అధ్యక్షుడికి చేదు అనుభవం

కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్‌కు మలయాళ సూపర్ స్టార్, అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) అధ్యక్షుడు మోహన్‌లాల్‌ను ముఖ్య అతిథిగా పిలవడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. వందకు పైగా సినీ సెలబ్రిటీలు మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ఇండస్ట్రీలో చర్చనీయాశంమైంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు బిజుకుమార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. ఓ నటికి అన్యాయం చేసిన నటుడికి గౌరవం ఇవ్వకూడదని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. మోహన్‌లాల్‌ను వ్యతిరేకిస్తున్న వారిలో ప్రకాష్‌రాజ్‌, మాధవన్‌, సచ్చిదానందన్‌, శంకరన్‌ పిళ్లై, రాజీవ్‌ రవి, బినాపాల్‌, రిమా కల్లింగల్‌, శృతి హరహరన్‌ సహా పలువురు ఉన్నారని తెలిపారు.

5 23

సినీ అవార్డుల ఫంక్షన్‌కు ఆర్టిస్టులు వ్యతిరేకిస్తున్న వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలవడం ఎవరూ ఇష్టపడటం లేదని, అంతకంటే సీఎం చేతులమీదుగానో, లేక సాంస్కృతిక శాఖ మంత్రి చేతుల మీదుగానో అవార్డులు ఇస్తే బాగుంటుందని దాని సారాంశం. అయితే నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్‌ను “అమ్మ”లో తిరిగి చేర్చుకోవడాన్ని అసోసియేషన్‌కు చెందిన పలువురు వ్యతిరేకిస్తున్నారు. దిలీప్‌ను అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని అమ్మ అధ్యక్షుడైన మోహన్‌లాల్‌ను పలువురు కోరినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే మోహన్‌లాల్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఓ నటికి అన్యాయం చేసిన నటుడికి ఆ గౌరవం ఇవ్వొద్దని అభిప్రాయపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu