బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నిన్న ట్విట్టర్ లో ‘ముజే లడకీ మిల్ గయీ’ అని పోస్ట్ పెట్టాడు. కండల వీరుడు ఈ విధంగా పోస్ట్ పెట్టడంతో నిజంగానే సల్మాన్ కు అమ్మాయి దొరికిందని, అతడు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ సల్మాన్ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అభిమానులను ఫూల్స్ చేశాడనే అనుకోవాలి. సల్మాన్ కు అమ్మాయి దొరకడం నిజమే కానీ అది అతడు నిర్మించబోయే సినిమాలో హీరోయిన్ అని తీరికగా చెప్పుకొచ్చాడు. తన గారాల చెల్లెలు అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మను వెండితెరకు పరిచయం చేస్తూ ఓ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా వరీనా హుస్సేన్ అనే అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు సల్మాన్. గతంలో ఈ బ్యూటీ డెయిరీ మిల్క్ యాడ్ లో కూడా కనిపించింది. అదన్నమాట మేటర్. సల్మాన్ ఉన్నట్లుండి నాకు అమ్మాయి దొరికిందని అనగానే అభిమానులంతా కూడా సల్మాన్ పెళ్లి చేసుకోబోతుండంటూ అతడికి శుభాకంక్షాలు చెప్పారు. కానీ విషయం తెలుసుకొని సల్మాన్ మమ్మల్ని ఫూల్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.