HomeTelugu Newsఅమ్మగా ఉండడమే నా ఉత్సాహానికి కారణం

అమ్మగా ఉండడమే నా ఉత్సాహానికి కారణం

ఓ వైపు యాంకరింగ్‌.. మరోవైపు సినిమాలతో బిజీ అయిపోయింది అనసూయ. వరుసగా షోలకు యాంకరింగ్‌ చేస్తూనే మరోపక్క సినిమాల్లోనూ మంచి పాత్రలు దక్కించుకుంటుంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా అందరినీ అలరించిన అనసూయ ఇప్పుడు ఏ పాత్రల్లో నటించేందుకైనా సిద్ధమే అంటుంది. మిడిలేజ్‌, ఓల్డ్‌ ఏజ్‌ ఇలా ఏ పాత్రలైనా సరేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించింది.

3 2 1

అనసూయ తన తరువాత సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ తాను మరో మూడు సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. అయితే వాటికి సంబంధించిన విషయాలను చెప్పలేనంది. తమిళంలో నటించే అవకాశం కోసం ఎదురుచుస్తున్నట్లు తెలిపింది. తారక్‌ నటించిన చిత్రాల్లో రాఖీ, బృందావనం, అదుర్స్‌, నాన్నకు ప్రేమతో, జైలవకుశ అనసూయకు నచ్చిన చిత్రాలట. ఇక మహేష్ బాబు నటించిన చిత్రాల్లో చాలనే ఉన్నాయి గానీ ముఖ్యంగా మురారి అంటే చాలా ఇష్టమని తెల్పింది. తనది లవ్‌, అరేంజ్ట్‌ మ్యారేజ్‌ అని తనను ఎక్కువగా విమర్శించేది తన భర్త అని చెప్పింది. ఇంకా ఎవరైనా ఒక హీరో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తనకు నచ్చదని ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్‌ అని చెప్పింది. అనసూయ ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణం అమ్మగా అన్ని పనులు నిర్వర్తించడమేనని అంటోంది. తన చివరి క్షణాలో తన కుటుంబంతో ఉండాలని కోరుకుంటానంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu