ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ట్విటర్, ఫేస్‌బుక్‌లో ఖాతాలు ఉన్నాయి. కానీ వాటిని తన రాజకీయ అంశాల గురించి చర్చించడానికి వాడుతుంటారు కానీ వ్యక్తిగత విషయాలను తక్కువగా పోస్ట్ చేస్తుంటారు. ట్విటర్‌లో పవన్‌కు 3.2 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఎవ్వరికీ ఫాలో అవడం లేదు. అయితే ఇప్పుడు పవన్ ట్విటర్‌లో ఒకే ఒక్క వ్యక్తిని ఫాలో అవుతున్నారు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.
ఈ సందర్భంగా అమితాబ్‌ను ఉద్దేశిస్తూ పవన్ ఓ పోస్ట్ పెట్టారు. ‘గౌరవనీయ అమితాబ్ బచ్చన్ జీ.. మీరంటే నాకెంతో ప్రేమ, గౌరవం సర్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు సెల్యూట్ చేస్తూ నేను చేసిన పోస్ట్‌ను మీరు రీట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు. ఆ పోస్ట్ ‘పోయెమ్స్ ఆఫ్ లవ్ అండ్ వార్’ పుస్తకంలోనిది. ఈ పుస్తకాన్ని ఏకే రామానుజన్ అనే రచయిత తమిళం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. జైహింద్ సర్’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు పవన్.