HomeTelugu Newsఅభిమానులను ఫిదా చేస్తున్న"ఐశ్వర్య" వీడియో సాంగ్

అభిమానులను ఫిదా చేస్తున్న”ఐశ్వర్య” వీడియో సాంగ్

చాలా కాలం తర్వాత బాలీవుడ్‌ అందాల నటి ఐశ్వర్యారాయ్, అనిల్‌ కపూర్ కలిసి “ఫన్నేఖాన్” అనే చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుధవారం ఓ పాటను విడుదల చేశారు. ఐశ్వర్యపై చిత్రీకరించిన ఈ పాటలో ఆమె డ్యాన్స్‌ను స్టార్‌ కొరియోగ్రాఫర్ ఫ్రాన్క్‌ గట్సన్‌ జూనియర్‌ డిజైన్‌ చేశారు. ఇందులో వేలాది మంది సంగీత ప్రియుల ముందు స్టేజ్‌పై ఉత్సాహంగా స్టెప్పులేస్తూ అదరగొట్టారు. అంతేకాకుండా ఐష్‌ మరింత అందంగా కనిపించారు. ఈచిత్రం వచ్చేనెల 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

6 12

“ఫ్యానే ఖాన్” చిత్రంలో ఐశ్వర్యారాయ్ పాప్ స్టార్‌గా కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. 18 ఏళ్ల క్రితం బెల్జియన్ చిత్రం “ఎవ్రిబడీ ఫేమస్” చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అప్పట్లో ఆ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది. ప్రముఖ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రాతో కలసి అనిల్‌ కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహిళా కళాకారుల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ చిత్రం ఉంటుందని.. ఓ తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే అందమైన కథగా దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu