HomeTelugu News'అభిమన్యుడు' మూవీ ట్రైలర్‌

‘అభిమన్యుడు’ మూవీ ట్రైలర్‌

హీరో విశాల్‌, హీరోయిన్‌ సమంత జంటగా నటించిన చిత్రం ‘అభిమన్యుడు’. ఈ చిత్రానికి మిథున్‌ దర్శకత్వంలో వహించగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌ పాత్ర పోషించారు. జూన్‌ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘ఇరుంబితిరై’ టైటిల్‌తో ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించిది. విశాల్‌ సినీ కెరీర్‌లో ఈ చిత్రం బిగ్‌ హిట్‌ గా నిలిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

5 10

ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విశాల్‌ ఒక మిలటరీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌. ఈ చిత్రాన్ని సైబర్‌ నేరాల నేపథ్యంలో తెరకెక్కించారు. ఏటీఎం మోసాలు మొదలుకొని ఆధార్‌ కార్డ్‌, డిజిటల్‌ ఇండియా సమస్యల వరకు పలు విషయాల్ని ఇందులో ప్రస్తావించారు. ‘సాధారణంగా మీకు కోపం ఎక్కువగా వస్తుంటుందా.. వీడికి కోపం మాత్రమే వస్తుంది..’ అనే డైలాగ్‌ తో ఈ ట్రైలర్‌ ప్రారంభమౌతువుంది. ‘ఒక మిలటరీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ అన్న సంగతి మర్చిపోయి ఎందుకయ్యా ఇంత ఎమోషన్‌ అవుతున్నావు…’అని పై అధికారి విశాల్‌ను మందలిస్తున్నారు.

‘నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. మిలటరీ వాడికి పాస్‌పోర్టు ఉంటుంది, రేషన్‌ కార్డు సరిగా ఉంటుంది. కష్టం అని మీ దగ్గరికి వస్తే లోన్‌ ఇవ్వమంటారు’….అంటూ విశాల్‌ చెబుతున్నారు. ‘ఇంతకు ముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్‌ వార్‌, ఆ తర్వాత బయోవార్‌..ఇప్పుడు సైబర్‌ వార్‌. నీతో సహా అందరూ దొంగలు.. నేను తేలు.. నేను కుడితే మూసుకుని ఉండాలి’ అంటూ ట్రైలర్‌లో అర్జున్‌ తన విలనిజాన్ని పండించాడు. ఇలా ఆసక్తికర సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ రూపొందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu