రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నచిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో ఓ పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో పంది పిల్ల బంటిని పరిచయం చేసారు దర్శక నిర్మాతలు. చెక్క కంచెకు వేలాడుతూ నవ్వుతూ ఉన్న పందిపిల్ల చాలా క్యూట్ గా అందర్నీ అలరిస్తుంది. రవిబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ ను చూపిస్తోన్న సినిమా అదుగో. దీనికోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు రవిబాబు. సురేష్ ప్రొడక్షన్ సంస్థలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిన్న పిల్లలను అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో మాత్రం బంటి పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.