రాజమౌళి తనకు శివగామి పాత్రను ఆఫర్ చేసినప్పుడు 8కోట్ల పారితోషికం.. ఒక హోటల్ ఫ్లోర్ మొత్తం, పది విమానం టిక్కెట్లు అడిగానని నాపై రాజమౌళి ఓ టీవీ కార్యక్రమం లైవ్‌లో నిందలు వేశారని, అది తనను ఎంతో బాధించిందని అన్నారు శ్రీదేవి. ఆ లింక్‌ను నాకు వేరొక స్నేహితుడు పంపించినప్పుడు చూసి ఆశ్చర్యపోయానని, ఒక నిర్మాత భార్యగా.. తనకు నిర్మాత కష్టాలు తెలుసని, అయితే బాహుబలి నిర్మాతలే రాజమౌళితో అలా ఏమైనా చెప్పారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. తాను అలా డిమాండ్ చేయనేలేదని వివరణ ఇచ్చారు. రాజమౌళి అలా చెప్పడం కరెక్ట్ కాదని ఖండించారు. జరిగిందేదో జరిగింది. బాధ కలిగించింది.
అయినా రాజమౌళి బాహుబలి లాంటి మరెన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించాలని శ్రీదేవి ఆశీస్సులు అందించారు. అందుకే శ్రీదేవి మామ్ విషయంలో తాను తప్పు చేశానని అంగీకరించిన జక్కన్న అలాంటి తప్పు చేసి ఉండాల్సింది కాదని పశ్చాత్తాపపడడం టాలీవుడ్‌లో చర్చకొచ్చింది. శ్రీదేవి మరణం వార్త విన్న రాజమౌళి .. పెద్ద షాక్‌కి గురయ్యానని ట్వీట్ చేశారు. 54ఏళ్ల జీవితంలో 50 ఏళ్లు సినిమాకే అంకితమైన గ్రేట్ సూపర్‌స్టార్ అని శ్రీదేవిని కీర్తించారు. ఇలాంటి నిష్కృమణం ఊహించలేదని.. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.