Homeతెలుగు వెర్షన్అగ‌ష్టు 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న స‌ర్‌ప్రైజింగ్ థ్రిల్ల‌ర్‌ 'అవసరానికో అబద్ధం'

అగ‌ష్టు 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న స‌ర్‌ప్రైజింగ్ థ్రిల్ల‌ర్‌ ‘అవసరానికో అబద్ధం’

అగ‌ష్టు 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న స‌ర్‌ప్రైజింగ్ థ్రిల్ల‌ర్‌ ‘అవసరానికో అబద్ధం’ 
 
‘అవసరానికో అబద్ధం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయడంతొ ఈ చిత్రానికి టాలీవుడ్ లో క్రేజ్ వ‌చ్చింది.  ఈ చిత్రం సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అగ‌ష్టు 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కి సిధ్ధ‌మైంది. 
 
ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు సురేష్ కెవి మాట్లాడుతూ… అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సినిమాను బాగా ప్రమోట్ చేసి, మౌత్ పబ్లిసిటీతో సినిమా విజయవంతం అయ్యేలా ప్రయత్నించండి. అప్పట్లో మా స్వయంవరం చిత్రం టాక్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యి బాగా పికప్ అందుకొని విజయవంతంగా 175 రోజులు పూర్తి చేసుకుంది. అని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చెప్పిన మాట‌లు తూచా త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని ప్ర‌మెట్ చేస్తున్నాం. డైలాగ్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ త్రివిక్ర‌మ్ అలాంటి ద‌ర్శ‌కుడు మా చిత్రం డైలాగ్స్ గురించి ప్ర‌స్తావించ‌టం మా అదృష్టం గా భావిస్తున్నాను. నాపై ఉన్న నమ్మకంతో చిత్రాన్ని నిర్మించిన నా స్నేహితులకు… సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి కృషి చేసిన మా టీంకు, సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రమోషనల్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్న శ్రియాస్ మీడియాకు కృతజ్ఞతలు తెలిజయేస్తున్నాను. నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పిందెవరు? అబద్దమని నువ్వు అనుకొనే దాన్ని అబద్దమని నీకు చెప్పిందెవరు? అనే ఆలోచనకు ప్రతి రూపమే అవసరానికో అబద్ధం. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు అందరినీ కట్టిపడేసేలా చిత్రీక‌రించామని సెన్సారు స‌భ్యులు ప్ర‌శంశించ‌టం విశేషం. అగ‌ష్టు 26న మా చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము. మా చిత్రాన్ని ప్ర‌మెట్ చెయ్య‌టానికి ముందుకొస్తున్న ఫిల్మ్ సెల‌బ్రిటిస్ కి మా ధ‌న్య‌వాదాలు..  మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. . అని అన్నారు. 
 
 
బ్యానర్ – చక్రం క్రియేషన్స్
నటీనటులు – లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సందీప్, వెంకీ, ఎంజిఆర్, గిరిధర్, మురళి, విజయ్ తదితరులు
సినిమాటోగ్రఫి – వెంకటరమణ ఎస్
సంగీతం – సాయి కార్తిక్
ఎడిటింగ్ – కార్తిక్ శ్రీనివాస్
డిఐ – శ్రీనివాస్ మామిడి
ఎఫెక్ట్స్ – యతిరాజ్
లైన్ ఎడిటింగ్ – అజయ్ బి
డిటిఎస్ మిక్సింగ్ – రాజశేఖర్
ఆర్ట్ – కిరణ్
ప్రమోషనల్ పార్ట్ నర్ – శ్రియాస్ మీడియా
రచన దర్శకత్వం – సురేష్ కెవి
నిర్మాతలు – విజయ్.జె, పులి శ్రీకాంత్, సందీప్ మరియు స్నేహితులు

Recent Articles English

Gallery

Recent Articles Telugu