Homeతెలుగు వెర్షన్అఖిల్ కన్ఫ్యూజన్ వీడేది అప్పుడే!

అఖిల్ కన్ఫ్యూజన్ వీడేది అప్పుడే!

అఖిల్ కన్ఫ్యూజన్ వీడేది అప్పుడే!
అక్కినేని అఖిల్ తన మొదటి చిత్రం ‘అఖిల్’తో నిరాశ చెందాడు. తన తదుపరి చిత్రంతో ఎలా అయినా 
హిట్ కొట్టాలని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో హను రాఘవపూడితో సినిమా కన్ఫర్మ్ 
అయినట్లుగా వార్తలు వచ్చాయి. అఖిల్ కూడా సినిమా ఓకే అయినట్లుగా ట్వీట్ చేశాడు. సడెన్ గా 
ఏమైందో తెలియదు కానీ హనుని ప్రాజెక్ట్ నుండి తప్పించారు. ఆ స్థానంలోకి విక్రమ్ కె కుమార్ 
వచ్చినట్లుగా మరో వార్త హల్ చల్ చేసింది. ఈ లిస్టులో మారుతి కూడా చేరాడు. అయితే ఫైనల్ గా 
విక్రమ్ కె కుమార్ కే ఈ అవకాశం వెళ్ళినట్లుగా సమాచారం. విక్రమ్ చెప్పిన కథ అఖిల్ తో పాటు 
నాగార్జునకు కూడా నచ్చడంతో ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాగార్జున 
పుట్టినరోజు నాడు ఈ నెల 29న అఫీషియల్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu