తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫ్యామిలీ వార్ కు తెరతీస్తున్నారు. బాలీవుడ్ లో జూన్ 1న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ రెండు సినిమాలు ఒకే కుటుంబానికి చెందిన వారసులవి కావడం విశేషం. అదికూడా అక్కా తమ్ముళ్లవి. సోనమ్ కపూర్ వీరి ది వెడ్డింగ్.. అదే రోజు హర్షవర్ధన్ ”భావేష్ జోషి” సినిమా విడుదల కాబోతున్నాయి. పెళ్లంటే వద్దనుకునే నలుగురు అమ్మాయిల కథతో రూపొందుతున్న వీరిది వెడ్డింగ్ లో సోనమ్ తో పాటు కరీనా కపూర్, స్వర భాస్కర్ నటిస్తున్నారు. శశాంక ఘోష్ దర్శకత్వంలో కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా బాలాజీ మోషన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోంది.
తాజాగా సెన్సార్ పూర్తిచేసుకున్నఈ చిత్రానికి A సర్టిఫికెట్ వచ్చింది.
2016లో మిర్జియా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన హర్షవర్ధన్ కపూర్ భారీ బడ్జెట్, పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం డిజాస్టర్ కావడంతో రెండేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు ఈ కుర్ర హీరో. మళ్లీ ఇన్నాళ్లకు భావేష్ జోషి అంటూ వస్తున్నాడు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఫాంటం ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అటు అక్క సోనమ్ కపూర్, ఇటు తమ్ముడు హర్షవర్ధన్ జూన్ 1న బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నారు.